యాదాద్రి భువనగిరి : ప్రభుత్వ ఉద్యోగికి రావలసిన వేతన బిల్లుల కోసం లంచం తీసుకున్న ట్రెజరరీ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ ( ACB ) అధికారులు పట్టుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ( Senior Assistant) గా పనిచేస్తున్న ఎండీ ఖదీర్( Khadeer ) విడదల వారిగా ఫోన్ పే ద్వారా రూ. 15 వేలు లంచం తీసుకున్నాడు. అధికారి అవినీతిపై బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖదీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం మోత్కూర్‌లోని ఎస్టీవో కార్యాలయంపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 38 రోజులకు సంబంధించిన వేతనం రూ. 1,09,384 కోసం బాధితుడు అధికారులను సంప్రదించగా తొలి విడతగా ఖదీర్ స్నేహితుడు సీనియర్ అసిస్టెంట్ నిరంజన్ అకౌంట్లోకి రూ.5 వేలు ట్రాన్స్ఫర్ చేయించాడు.
చివరి రెండు విడతలు ఖదీర్‌కు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఏసీబీ అధికారులు ఎస్టీవో సీనియర్ అసిస్టెంట్ ఖదీర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.