Laskhar Bonalu | లష్కర్ బోనాల జాతర షురూ.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Laskhar Bonalu | లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Laskhar Bonalu | లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేశారు. బందోబస్త్‌లో సుమారు 1500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, లష్కర్ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించగా.. రేపు సోమవారం నాడు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఇదిలా ఉంటే.. లష్కర్ బోనాల దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. జాతర సందర్భంగా 1వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటల నుంచి 4వ తేదీ ఉదయం వరకు పొగాకుబజార్, హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులు, సుభాష్‌రోడ్ , హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్‌రోడ్స్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారి, జనరల్‌బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారిని మూసివేస్తామని చెప్పారు. ముఖ్యంగా కర్బాలాక్రాస్రోడ్స్ వద్ద చిల్డ్రన్‌పార్క్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్‌వైపు మళ్లిస్తారు. రాణిగంజ్క్రాస్రోడ్స్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు,సాధారణ వాహనాలు రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్డు , గోపాలపురం లైన్ మీదుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

