రామగిరి, మార్చి 12 : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ( అటానమస్) లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “Research Methodology and Report Writing” (పరిశోధన పద్ధతులు – నివేదిక తయారు చేయుట) అనే అంశంపై గురువారం ఒక రోజు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మంజుల అధ్యక్షత వహించగా ప్రభుత్వ కళాశాల కూకట్పల్లి కామర్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు రిసోర్స్ పర్సన్ గా పాల్గొని పరిశోధన, రిపోర్ట్ తయారు చేసే విధానాన్ని వివరించారు. ప్రతి ఒక్కరు పరిశోధన పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
కామర్స్ విభాగం అధిపతి డా.సాలయ్య మాట్లాడుతూ.. కామర్స్‌లో ఉన్న అవకాశాలను వాటిని సాధించుకునే తీరును వివరించారు. కళాశాల గ్రంథాలయ శాఖ అధ్యక్షుడు డా.రాజారామ్ మాట్లాడుతూ కళాశాలలో ఉన్న సౌకర్యాలు వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పరిశోధన పట్ల ఉన్న తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.అమరావతి, డా.రాజు, డా.శైలజ, నగేశ్, సారిక, శ్వేత పాల్గొన్నారు.