ఓవరాల్ చాంపియన్‌గా పోలీసుల హ్యాట్రిక్
అఖిల భారత పోలీస్ డ్యూటీమీట్‌లో రాష్ట్ర పోలీస్ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన రాష్ట్ర పోలీస్ బృందం, మూడోసారి ‘ఓవరాల్ చాంపియన్' ట్రోఫీని కైవసం చేసుకున్నది.
- ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో సరికొత్త రికార్డు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పోలీస్ డ్యూటీమీట్‌లో రాష్ట్ర పోలీస్ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన రాష్ట్ర పోలీస్ బృందం, మూడోసారి ‘ఓవరాల్ చాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా విజేతలు, వారికి శిక్షణ ఇచ్చిన అధికారులను డీజీపీ బీ శివధర్‌రెడ్డి అభినందించారు. రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుంద ని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు.
అత్యంత క్లిష్టమైన యాంటీ సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్ పోటీల్లో రాష్ట్ర పోలీసు లు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారని కొనియాడారు. వీటితోపాటు సైంటిఫిక్ ఎయి డ్స్ టు ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఫొటోగ్రఫీ విభాగాల్లోనూ ద్వితీ య స్థానంలో నిలిచారని తెలిపారు. డ్యూటీ మీట్లో 6 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్న సందర్భంగా సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా, ప్రధాన కోచ్‌లు ప్రతాప్ (అదనపు ఎస్పీ టీజీజెన్కో), రామకృష్ణ (కమాండెంట్ 8వ బెటాలియన్), టీమ్ మేనేజర్ కే ప్రసాద్ (ఎస్పీ సీఐడీ)తోపాటు విజేతలకు డీజీపీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

