Israeli Military: తలేఘాన్ అణు కేంద్రం ధ్వంసం: ఐడీఎఫ్
Israeli Military: టెహ్రాన్ సమీపంలో ఉన్న న్యూక్లియర్ కేంద్రాన్ని తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. తలేఘాన్ కేంద్రం నుంచి ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేస్తున్నదని, కీలకమైన పరీక్షలు చేపడుతున్న ఆ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
టెల్ అవివ్ : ఇరాన్లో ఉన్న ఓ న్యూక్లియర్ కేంద్రాన్ని తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(Israeli Military) పేర్కొన్నాయి. ఆ కేంద్రం నుంచి ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేస్తున్నదని, కీలకమైన పరీక్షలు చేపడుతున్న ఆ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలేఘాన్ కాంపౌండ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఈ కేంద్రం నుంచి ఇరాన్ ఇటీవల కాలంలో అత్యాధునిక విస్పోటక పదార్ధాలను తయారు చేసినట్లు ఐడీఎఫ్ ఆరోపించింది.
ఏఎంఏడీ ప్రాజెక్టు కోసం ఇక్కడే అత్యంత సున్నితమైన పరీక్షలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ అత్యంత రహస్యంగా అమద్ ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం.. అమద్ ప్రాజెక్టులో భాగంగా 1989 నుంచి 2003 వరకు తలేఘాన్ కేంద్రంలో ఇరాన్ అణ్వాయుధాలు డెవలప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన దాడిలో కూడా తలేఘాన్ కాంపౌండ్ దెబ్బతిన్నది.
అయితే ఈ కాంపౌండ్‌ను మళ్లీ పునర్ నిర్మిస్తున్నారని తెలిసిందని, ఈ నేపథ్యంలో దాన్ని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది. తలేఘాన్ అణు కేంద్రం నుంచే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

