లక్నో: ఒక యువకుడు రైలు కోచ్‌లో స్నానం చేశాడు. బకెట్‌లోని నీళ్లను మగ్గుతో తలపై పోసుకున్నాడు. ఈ రీల్‌ను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో రైల్వే స్పందించింది. అతడ్ని గుర్తించి చర్యలు చేపట్టింది. (Youth Bath In Train Coach) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోత్ పట్టణానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్, నవంబర్ 1న ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆగ్రా వెళ్లేందుకు జనరల్ టికెట్ కొనుగోలు చేశాడు.
కాగా, రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో నిలిచి ఉన్న రైలులోకి ప్రమోద్ శ్రీవాస్ ఎక్కాడు. ఒక స్లీపర్ కోచ్‌లో కొద్ది మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో రీల్ కోసం అతడు ప్రయత్నించాడు. ఒక బకెట్లో నీళ్లు తెచ్చుకున్నాడు. కంపార్ట్మెంట్ డోర్ వద్ద స్నానం చేశాడు. తలకు షాంపు రుద్దుకొని మగ్గుతో నీళ్లు పోసుకున్నాడు. రీల్ రికార్డ్ చేసిన తర్వాత ఆగ్రా వెళ్లే రైలు ఎక్కాడు. రైలు కోచ్‌లో స్నానం చేసిన వీడియోను అతడి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైల్వే స్పందించింది. స్లీపర్ కోచ్‌లో స్నానం చేసిన యువకుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రైల్వే పేర్కొంది. ఆ యువకుడు తన చర్యలకు క్షమాపణ చెప్పాడని, యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో తొలగించినట్లు వెల్లడించింది. ఎవరూ కూడా రైళ్లలో ఇలాంటివి చేయవద్దని రైల్వే సూచించింది.
Gems Of Railways
Man taking bath in a train pic.twitter.com/9h0iLlVwsz
— Woke Eminent (@WokePandemic) November 8, 2025
Also Read:
Model Dies | మోడల్ అనుమానాస్పద మృతి.. హాస్పిటల్లో వదిలేసి ప్రియుడు పరార్
Student Burns To Death | ఫీజు చెల్లించనందుకు పరీక్షకు నిరాకరణ.. నిప్పంటించుకుని విద్యార్థి మృతి
Bengaluru jail | బెంగళూరు జైలులో ఖైదీల జల్సాపై చర్యలు.. ఉన్నతాధికారులు సస్పెండ్