భోపాల్: ఒక మోడల్ అనుమానాస్పదంగా మరణించింది. (Model Dies) ప్రియుడు ఆమెను హాస్పిటల్‌కు తరలించాడు. చనిపోయినట్లు తెలుసుకుని అక్కడ వదిలేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఖుష్బూ అహిర్వార్ అలియాస్ ఖుషీ వర్మ కాలేజీ చదువును మధ్యలో మానేసింది. మోడల్‌గా ఆమె చేస్తున్నది. పలు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా చేసింది. ‘డైమండ్ గర్ల్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ పోస్టులతో ఆమె పాపురల్ అయ్యింది.
కాగా, మోడల్ ఖుష్బూ గత మూడేళ్లుగా భోపాల్‌లో నివసిస్తున్నది. ప్రియుడు కాసిమ్‌తో కలిసి సహజీవనం చేస్తున్నది. సోమవారం తెల్లవారుజామున ఖుష్బూ ఆరోగ్యం క్షీణించింది. దీంతో భైంసఖేడిలోని ఇండోర్ రోడ్డులో ఉన్న హాస్పిటల్‌కు ఆమెను కాసిమ్ తీసుకెళ్లాడు. ఖుష్బూ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమె మృతదేహాన్ని హాస్పిటల్లో వదిలేసిన కాసిమ్ అక్కడి నుంచి పారిపోయాడు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ హాస్పిటల్‌కు చేరుకున్నారు. మోడల్ ఖుష్బూ మరణంపై ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కుటుంబం, మేజిస్ట్రేట్ సమక్షంలో గాంధీ మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
అయితే ఖుష్బూ శరీరం, ముఖం, భుజాలు, ప్రైవేట్ భాగాలపై గాయాల గుర్తులు ఉన్నాయని ఆమె తల్లి ఆరోపించింది. ప్రియుడు కాసిమ్ ఆమెను కొట్టి చంపాడని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు కాసిమ్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Student Burns To Death | ఫీజు చెల్లించనందుకు పరీక్షకు నిరాకరణ.. నిప్పంటించుకుని విద్యార్థి మృతి
Bengaluru jail | బెంగళూరు జైలులో ఖైదీల జల్సాపై చర్యలు.. ఉన్నతాధికారులు సస్పెండ్
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్