బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఖైదీల జల్సాకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. జైలు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. (Bengaluru jail) పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష పొందుతున్న ఖైదీలు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు సొంతంగా వండుకుని తింటున్నారు. అంతేగాక మందు పార్టీలు చేసుకుని చిందులు వేస్తున్నారు. ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీల చట్టవిరుద్ధ కార్యకలాపాలు, వీఐపీ మర్యాదలు, మద్యం సేవించడం, డ్యాన్సులు వేయడం వంటి వీడియోలు గత రెండు రోజులుగా వెలుగులోకి వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైలు సూపరింటెండెంట్ మాగేరి, జైలు ఏఎస్పీ అశోక్ భజంత్రీలను సస్పెండ్ చేసింది. జైలు చీఫ్ సూపరింటెండెంట్ సురేష్‌ను బదిలీ చేసింది.
మరోవైపు జైలులో జరుగుతున్న చట్టవిరుద్ధ సంఘటనలపై కేసులు నమోదు చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. జైలులో పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read:
Watch: బెంగళూరు జైలులో ఖైదీల మందు పార్టీలు, చిందులు.. వీడియోలు వైరల్
Watch: బెంగళూరు జైలులో ఇదీ పరిస్థితి.. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తున్న రేపిస్టులు, నేరస్తులు
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్