బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని సెంట్రల్ జైలులో మరిన్ని భద్రతా లోపాలు బయటపడ్డాయి. (Bengaluru Central Jail) ఖైదీలు మందు పార్టీలు జరుపుకున్నారు. మద్యం తాగి చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు వినియోగించడం, టీవీ చూడటం, వంట చేసుకోవడం వంటి వీడియోలు శనివారం వెలుగులోకి వచ్చాయి.
కాగా, తాజాగా ఖైదీల మందు పార్టీల విషయం బయటపడింది. ఆ జైలు లోపల మద్యం బాటిళ్లు కనిపించాయి. డిస్పోజబుల్ గ్లాసుల్లో మద్యం, పండ్ల ముక్కలు, వేయించిన వేరుశెనగలు ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఖైదీలు మందు పార్టీ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అయ్యింది. దీంతో బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల జల్సాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ జైలులోని భద్రతా లోపాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Following yesterday’s viral footage showing inmates using mobile phones & watching TV,new videos have allegedly surfaced from inside #ParappanaAgrahara Central #Jail.
The latest clips appear to show inmates dancing(recorded using mobile phones) and alcohol bottles inside jail. https://t.co/wgLftdcqax pic.twitter.com/M0OikcLcCK— Yasir Mushtaq (@path2shah) November 9, 2025
Also Read:
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్
Students Shoot Classmate | క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించి.. ఇద్దరు విద్యార్థులు కాల్పులు
Parents Kill Daughter | అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు