Nothing Phone 4a : ప్రత్యేక డిజైనింగ్, క్లీన్ యూఐతో గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ సంస్థ నుంచి తాజాగా నథింగ్ ఫోన్ 4ఏ, నథింగ్ ఫోన్ 4ఏ ప్రో పేరుతో రెండు మీడియం రేంజ్ ఫోన్లు విడుదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు ఇండియాలో కూడా గురువారమే ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఆన్లైన్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. కొత్తగా వచ్చిన గ్లైఫ్ బార్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ ఈ ఫోన్ల మరో ప్రత్యేకత. కెమెరా వద్ద 63 మినీ ఎల్ఈడీలు, ఆరు ప్రత్యేక జోన్లు ఉంటాయి. ఈ ఫోన్లలో ప్రధాన ఫీచర్లివి.
నథింగ్ ఫోన్ 4ఏ ఫీచర్లు
వైట్, బ్లాక్, పింక్, బ్లూ కలర్స్. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 205 గ్రాముల బరువు, 6.78 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7, జనరేషన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ మెయిన్ కెమెరా (50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, నానో సిమ్ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 5జీ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు రూ.31,999/ రూ.34,999 / రూ.37,999.
నథింగ్ 4ఏ ప్రో ఫీచర్లు
సిల్వర్, బ్లాక్, పింక్ కలర్స్‌లో లభ్యం. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 4, ఆక్టాకోర్ ప్రాసెసర్, ట్రిపుల్ మెయిన్ కెమెరా (50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 140 ఎక్స్ అల్ట్రా జూమ్, 6.83 అంగుళాల స్క్రీన్, అమోలెడ్ టీఎల్పీఎస్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ నథింగ్ ఓఎస్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 5జీ సపోర్ట్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్, పంచ్ హోల్ డిజైన్, మెటల్ యునిబాడీ, 5,000 నిట్స్ బ్రైట్నెస్, ఐపీ 65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్లకు బ్యాటరీ అడాప్టర్ మాత్రం రాదు. వీటి ధరలు రూ.39,999/ రూ.42,999 / రూ.45,999.