South Korea vs Ukraine : రష్యా (Russia) తరఫున పోరాడిన ఇద్దరు ఉత్తరకొరియా సైనికుల (North Korea Soldiers) ను పట్టుకుని దక్షిణకొరియా (South Korea) కు అప్పగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు (UKraine President) వోలోదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) ఇటీవల ఐరాస (UNO) లో ప్రకటించారు. అయితే జెలెన్స్కీ ప్రకటనపై దక్షిణకొరియా ప్రభుత్వం సీరియస్ అయింది. ఉక్రెయిన్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
యుద్ధ ఖైదీల అప్పగింత అంశంపై తమకు ఉక్రెయిన్‌కు మధ్య గోప్యతా ఒప్పందం ఉందని దక్షిణకొరియా చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీల అప్పగింత అంశాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలి. కానీ రష్యా తరఫున పోరాడుతూ ఉక్రెయిన్ దళాలకు చిక్కిన ఇద్దరు కిమ్ సైనికులను దక్షిణకొరియాకు అప్పగించామని ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
ఇలా బహిరంగంగా వెల్లడించడం రెండు దేశాల మధ్య ఉన్న గోప్యతా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దక్షిణకొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏకపక్షంగా ప్రకటన చేయడమేకాక తమ రెండు దేశాల మధ్య అలాంటి రహస్య ఒప్పందమేమీ లేదని జెలెన్స్కీ వెల్లడించడంపై తాము తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొన్నది. అంతర్జాతీయ చట్టాలు, మానవతా సూత్రాలకు లోబడి సైనికుల బదిలీని రహస్యంగా ఉంచడమే ఈ ఒప్పందం ఉద్దేశమని చెప్పారు. సైనికుల వివరాలు బహిర్గతమైతే స్వదేశంలోని వారి కుటుంబాల భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తంచేసింది.
ఇదిలావుంటే 2025 జనవరిలో రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతం నుంచి ఇద్దరు ఉత్తరకొరియా సైనికులను జెలెన్స్కీ సైన్యం బందీలుగా తీసుకుంది. ఆ ఇద్దరు సైనికులు దక్షిణకొరియాకు వెళ్తామని ప్రాధేయపడటంతో ఈ అప్పగింత జరిగింది.