ముంబై: ఇద్దరు వ్యక్తులు పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి చేశారు. బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. అయితే కెమెరామెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు వారిని వెంబడించాడు. (Groom stabbed at wedding) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో బద్నేరా రోడ్‌లోని సాహిల్ లాన్లో 22 ఏళ్ల సుజల్ రామ్ సముద్ర పెళ్లి జరిగింది.
కాగా, ఇద్దరు వ్యక్తులు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తి కత్తితో వరుడు సుజల్ రామ్‌ను పొడిచాడు. అక్కడి నుంచి పారిపోతుండగా వరుడి తండ్రి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నిందితులు ఆయనను కత్తితో బెదిరించారు. బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వరుడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
మరోవైపు డ్రోన్‌తో పెళ్లి షూటింగ్ తీస్తున్న కెమెరామెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు నిందితులను వెంబడించాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వీడియోను కీలక సాక్ష్యంగా పరిగణించారు.
కాగా, ఒక నిందితుడ్ని రఘో జితేంద్ర బక్షిగా పోలీసులు గుర్తించారు. డీజే సమయంలో జరిగిన వివాదం కారణంగా వరుడ్ని అతడు కత్తితో పొడిచినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు నిందితులను కెమెరా డ్రోన్‌తో వెంబడించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अमरावती में एक शादी समारोह में दो लड़कों ने दूल्हे पर जानलेवा हमला कर दिया। इसके बाद ड्रोन कैमरामैन में जो किया वो काबिल ए तारीफ है। pic.twitter.com/38SnObPAOO
— Shashank shukla (@shashaankshukla) November 12, 2025
Also Read:
Red Fort Blast | ఢిల్లీ పేలుడు అనుమానితులు.. మరో రెండు కార్లు కొనుగోలు?
Watch: రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం చేసిన వ్యక్తి
Watch: రైలు కోచ్‌లో స్నానం చేస్తూ యువకుడు రీల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?