న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మానవ బాంబు అనుమానితుడికి మరో కారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ ఎకోస్పోర్ట్ కారు యజమానిగా తెలుసుకున్నారు. దీంతో ఆ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (Delhi bomber owned 2nd car) సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద జరిగిన కారు పేలుడులో 12 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఆత్మాహుతికి పాల్పడిన మానవ బాంబు అనుమాతుడ్ని ఉమర్ నబీగా గుర్తించారు. బాంబు పేలుడుకు వినియోగించిన ఐ20 కారుతో పాటు ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును అతడు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
కాగా, డీఎల్ 10 సీకే 0458 నంబర్ కలిగిన ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు రెండో యజమానిగా డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని కూడా పిలిచే ఉమర్ ఉన్ నబీ పేరు మీద రిజిస్టర్ అయ్యిందని పోలీసులు తెలుసుకున్నారు. 2017 నవంబర్ 22న ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ఆర్డీవో వద్ద ఈ కారును రిజిస్టర్ చేశారు. ఈ కారు కొనుగోలు కోసం ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాను ఉమర్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తెలిసింది.
మరోవైపు ఎర్రకోట పేలుడు ఆపరేషన్‌లో రెండో వాహనంగా ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును నిందితులు వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్లాస్ట్ కేసులో కీలకంగా భావిస్తున్న ఈ కారు కోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Red Fort Blast | ఢిల్లీ పేలుడు అనుమానితులు.. మరో రెండు కార్లు కొనుగోలు?
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్
Watch: రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం చేసిన వ్యక్తి