హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) : సమాచార పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన ‘జెవెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్-ది గ్లోరీ ఆఫ్ వరంగల్’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం సచివాలయంలో ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన బుక్‌ను వెలువరించడం అభినందనీయమని ప్రశంసించారు.
రచయిత వెంకటరమణ మాట్లాడుతూ.. ఈ పుస్తకం చరిత్ర అధ్యయనవేత్తలు, విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఈ కాఫీ టేబుల్ బుక్ ఉపయోగపడుతుందని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తన చాంబర్లో వెంకటరమణ రచించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.