గోదావరి కాలుష్యంపై హైకోర్టు ఆందోళన
గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది.
- పలు రాష్ట్రాలతో ముడిపడిన వ్యవహారమని న్యాయస్థానం వ్యాఖ్య
- ఎన్జీటీలో పిటిషన్ వేసుకోవాలని సూచన
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది. వానకాలంలో ఘన వ్యర్థాలు నీటితోపాటు ప్రవహించి గోదావరిలో కలిసి కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని సమస్య మాత్రమే కాదని, గోదావరి పరీవాహక ప్రాంతమంతటా విస్తరించిందని పేర్కొంది.
గోదావరి నది, దాని ఉప నదులు, వాగులు, కాలువలలోకి శుద్ధిచేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని అరికట్టేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం దౌడేపల్లికి చెందిన ఆకుల సంపత్‌కుమార్ పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నది పరీవాహకం వెంట మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాలుష్యనియంత్రణ మండలిని ఆదేశించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫు న్యాయవాది వాదిస్తూ.. గోదావరి కాలుష్య నియంత్రణకు తమ బోర్డు పరిశీలన చేస్తున్నదని చెప్పారు. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ.. పిల్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

