Donald Trump : అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాజా (Gaza) విషయంలో కీలక ప్రకటన చేశారు. తాము గాజాని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి (Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benzamin Nethanyahu) తో కలిసి వాషింగ్టన్ (Washington) లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు.
తాము గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలో అది మధ్యప్రాచ్యంలో గర్వించదగ్గ ప్రాంతంగా మారుతుందని అన్నారు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ.. తాము గాజా ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలు, పేలని బాంబులను నాశనం చేయడానికి బాధ్యత తీసుకుంటామని తెలిపారు. గాజాను పూర్తిగా పునర్ నిర్మించుకోవడం తమకు అవసరమని అన్నారు.
గాజా ప్రాంతం పునర్ నిర్మాణం ద్వారా వేల కొద్ది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది మధ్యప్రాచ్య ప్రజలందరికీ గర్వ కారణం అవుతుందని ట్రంప్ అన్నారు. అయితే గాజా స్ట్రిప్‌పై అమెరికా ఏ విధమైన నియంత్రణను చేపడుతుంది..? చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అదేవిధంగా జో బైడెన్ విదేశీ వ్యూహాన్ని ట్రంప్ విమర్శించారు. మధ్యప్రాచ్యంలో నాలుగేళ్లుగా బైడెన్ ఏదీ చేయలేదని, తన అసమర్థతను మాత్రమే చాటుకున్నారని ఆరోపించారు.
పాలస్తీనా ప్రజల శాశ్వత పునరావాసం అంశాన్ని ప్రస్తావిస్తూ.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ – పాలస్తీనా సంఘర్షణకు ఒక పరిష్కారంగా రెండు దేశాల వ్యవస్థను సమీక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ట్రంప్ చెప్పిన చర్య చరిత్రను మార్చగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, హమాస్‌ను నిర్మూలించడానికి అమెరికా మార్గదర్శకత్వం సమర్థవంతంగా ఉండగలదని ఆశాభావం వ్యక్తంచేశారు.
కాగా ట్రంప్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ప్రకటనపై పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ సహా ఇతర అరబ్ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు