Gold price : అమెరికా (USA), చైనా (China) మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ (Trade war) ప్రభావంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు (Gold prices) భగ్గుమంటున్నాయి. ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దాంతో యెల్లో, వైట్ మెటల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన పది రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పసిడి ధర పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
దేశంలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర ఏకంగా రూ.950 పెరిగి రూ.79,050 కి చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర అయితే రూ.1,040 పెరిగి రూ.86, 240 కి పెరిగింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,07,000 లకు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక నగరానికి, మరో నగరానికి మధ్య బంగారం, వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది.
బంగారం ఏ నగరంలో ఎంత ధర పలుకుతుందో ఒకసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.79,020 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.86,390 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.79,050 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.86,240 పలుకుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా బంగారానికి ముంబై ధరలే ఉన్నాయి.
వెండి ధరలు కూడా బుధవారం ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.1,07,000 గా ఉంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర రూ.99,500 గా ఉంది. కానీ హైదరాబాద్, చెన్నైలో మాత్రం వెండి ధర రూ.1,07,000 పలుకుతోంది.
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు