Maha kumbha Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) 24వ రోజుకు చేరింది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
#WATCH | Prayagraj | Visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
Around 39 crore devotees have taken a holy dip so far at #MahaKumbh2025 – the world’s largest religious congregation pic.twitter.com/MnTDNvMSFA
— ANI (@ANI) February 5, 2025
జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ 39 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 37 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
Also Read..
Shamshabad | తిరుపతి వెళ్లాల్సిన విమానం రద్దు.. శంషాబాద్లో ప్రయాణికుల ఆందోళన
Delhi Elections | కొనసాగుతున్న పోలింగ్.. ఢిల్లీలో 8 శాతం ఓటింగ్ నమోదు
Health Tips | నిత్య జీవితంలో మీరు చేస్తున్న ఈ పొరపాట్లే సగం రోగాలకు కారణం అట తెలుసా..?