Auto driver : తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ప్రముఖ సినీ నటుడు (Cinema Actor) విజయ్ (Vijay) నెలకొల్పిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో ఆటో డ్రైవర్ (Auto driver) కు కీలక పదవి దక్కింది. పార్టీ కోయంబత్తూరు (Coimbattore) సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్ (Auto driver) ను నియమించారు. నటుడు విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
బాబుకు పార్టీ జిల్లా కార్యదర్శి పదవి దక్కిందని తెలుసుకున్న ఆయన స్నేహితులు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ బాబు మాట్లాడుతూ.. తాను విజయ్ అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కమ్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేశానని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడినని చెప్పారు. పార్టీ ప్రారంభించిన తర్వాత సాధారణ కార్యకర్తగా కొనసాగుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో తమ నేత విజయ్ తనకు జిల్లా శాఖ కార్యదర్శి పదవినివ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు