Lendijala Villagers | లెండిజాల గ్రామస్థుల ఆదర్శం.. పెళ్లిళ్లలో కట్న, కానుకలు నిషేదం
Lendijala Villagers | నేటి రోజుల్లో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెనుభారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి పెళ్లిళ్లకు తిప్పలు పడుతున్న వారందరికీ లెండిజాల గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది.
జైనూర్ : నేటి రోజుల్లో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెనుభారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి పెళ్లిళ్లకు తిప్పలు పడుతున్న వారందరికీ లెండిజాల గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ( Asifabad District ) జైనూర్ మండలం లెండిజాల గ్రామస్థులు ( Lendijala villagers) తాజాగా గ్రామంలో కట్న, కానుకలను ( Dowry and Gifts ) నిషేదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై గ్రామంలో జరిగే పెళ్లిళ్లలో కట్నాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ బుధవారం లెండిజాల రాయ్ సెంటర్లో సార్మేడి మెస్రం బాధిరావు పటేల్, గ్రామ ముఖ్యుడు మెస్రం పాలక్రావు దేవరి అధ్యక్షతన గ్రామ సమావేశంలో తీర్మానించారు. పెళ్లిళ్లలో కట్నాలు, కానుకల పేరుతో కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా గ్రామంలో ఎవరి కుటుంబంలో పెళ్లి శుభాకార్యం జరిగినా ఊరు మొత్తం కలిసి సహకరించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకోసం ప్రతి కుటుంబం రూ.400 చొప్పున చందా రూపంలో సేకరించి, పెళ్లి జరుపుకునే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధానాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామంలో మొదటి పెళ్లి జరుపుకుంటున్న మెస్రం జైతు కుటుంబానికి సేకరించిన నిధిని గ్రామస్థులు అందజేశారు. పెళ్లిళ్లలో అనవసర ఖర్చులు తగ్గి పేద కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

