శ్రీశైలం నాలుగో యూనిట్ సిద్ధం
వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది.
- 72 గంటల ట్రయల్ రన్ పూర్తయితే అవాంతరాలను అధిగమించినట్టే
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది. సుమారు ఆరేండ్ల తర్వాత 150 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. మరమ్మతుల్లో ఉన్న ఈ యూనిట్‌ను ఎట్టకేలకు మంగళవారం గ్రిడ్‌తో సింక్రనైజ్ చేశారు. 2020 ఆగస్టు 20న ఈ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం మరమ్మతులు చేపట్టారు. 2023లోనూ అంతరాయం ఏర్పడింది.
80 గంటలు నడిచిన తర్వాత మళ్లీ నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టగా 2025 అక్టోబర్ 2న మళ్లీ విద్యుత్తు ఉత్పత్తిని మొదలు పెట్టగా సుమారు 10 గంటలు నడిచిన తరువాత ఎయిర్ గ్యాప్ ప్రొటెక్షన్ కారణంగా మళ్లీ ట్రిప్ అయింది. పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రీ-కమిషనింగ్ పరీక్షలు పూర్తి చేసి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నుంచి జనరేటర్ చార్జింగ్కు అనుమతి తీసుకున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున 3.21 గంటలకు యూనిట్-4ను గ్రిడ్‌కు సింక్రనైజ్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా 72 గంటలపాటు నిరంతరాయంగా ఈ ప్లాంట్ నడిస్తే అవాంతరాలను అధిగమించినట్టు అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

