న్యూఢిల్లీ : కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో 132 మంది మరణించారు. కూలిపోయిన భవనాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 7.34 గంటలకు 7.4 తీవ్రతతో కూడిన భూకంపం చోకో ప్రావిన్సులో 103 కిలోమీటర్ల లోతున సంభవించింది.
కొలంబియాలోని కాఫీ సాగు ప్రాంతమైన పెరీరా నగరంలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. భూకంప కేంద్రం చోకో ప్రావిన్స్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మార్ గ్రామ సమీపంలో ఉంది. భూప్రకంపనల తీవ్రతకు కనీసం 570 మంది గాయపడ్డారు.