NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి అయిన గాయం, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా అభిమానులకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా కార్యక్రమానికి హాజరై అభిమానులు, మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన కుడిచేతిని ఉపయోగించిన తీరు అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఎన్టీఆర్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా అనే చర్చ మొదలైంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫహద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఎడమ చేతినే ఉపయోగించడం కనిపించింది. సాధారణంగా అభిమానులను పలకరించేటప్పుడు, అభివాదం చేసేటప్పుడు కుడిచేతిని ఎక్కువగా ఉపయోగించే ఆయన.. ఈసారి ఎడమ చేతితోనే అభివాదం చేశారు. అంతేకాదు, మైక్‌ను కూడా ఎడమ చేతితో పట్టుకుని మాట్లాడారు.
కుడిచేతిని పైకి ఎత్తకుండా, దాన్ని పెద్దగా కదిలించకుండా జాగ్రత్తగా ఉంచడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కార్యక్రమంలో పలువురితో మాట్లాడినప్పటికీ కుడిచేతితో షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ఉండటం కనిపించింది. దీంతో ఆయన గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదేమోనని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకున్నారు.ఇదిలా ఉండగా.. ఓ అభిమానిని ఎన్టీఆర్ కలిసిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అందులో ఆయన కుడిచేతికి సపోర్ట్ బెల్ట్ తరహా పౌచ్ ధరించి కనిపించారు. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు ఎన్టీఆర్ ఇంకా రికవరీ దశలోనే ఉన్నారని భావిస్తున్నారు. అయితే ఆయన గాయం పూర్తిగా ఎంతవరకు తగ్గిందనే విషయంపై ఎన్టీఆర్ నుంచి కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం ఆయన కనిపించిన తీరు ఆధారంగానే అభిమానులు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.
ఎన్టీఆర్ గాయం కారణంగా ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత మైత్రి రవిశంకర్ కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. మిగిలిన షూటింగ్‌ను అక్టోబర్ రెండో వారం నుంచి తిరిగి ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అయితే సినిమాలో ఇంకా కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చిత్రీకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు చెప్పిన షెడ్యూల్ ప్రకారం షూటింగ్ తిరిగి ప్రారంభమై, మిగిలిన పనులు సకాలంలో పూర్తయితే 2027 జూన్ 11న ‘డ్రాగన్’ విడుదలకు మార్గం సుగమం అవుతుంది. కానీ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో షూటింగ్‌కు తిరిగి ఎప్పుడు వస్తారనేది కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున.. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం ప్రకటించిన విడుదల తేదీకి సినిమా వస్తుందా లేదా అనేది రానున్న రోజులలో తెలియనుంది.
Tarak met the same ardent fan who was seen at the #Devara re release ❤️
The fan is deaf and mute, and @tarak9999 personally met him yesterday at the #DontTroubleTheTrouble Pre Release Event, making the moment truly special for him 🥹❤️#NTR pic.twitter.com/kPy5yTFMwY
— Milagro Movies (@MilagroMovies) September 30, 2026