Beauty tips : పోషకాలు మెండుగా ఉండే చెరకు రసం (Sugar cane Juice ) తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ చెరకు రసం కేవలం ఆరోగ్యానికే కాకుండా.. అందానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే చెరుకు రసంతో చెక్ పెట్టుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం..
చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. ఇంకా ఇందులో ఉండే సమ్మేళనాలు చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయి.
చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
కాఫీ పొడికి కాస్త చెరకు రసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
చెరకు రసం, నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని బాగా కలపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి మెరుపు వస్తుంది.
చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకు రసంతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలు ఉంటాయి. బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించడం వల్ల కూడా చర్మం బిగుతుగా మారుతుంది.
నాలుగు చెంచాల చెరకు రసంలో రెండు చెంచాల నెయ్యి చేర్చి చర్మానికి మర్దన చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటరు చెరకు రసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది.
ఇవే కాకుండా ఎలాంటి పదార్థాలను కలపకుండానే స్వచ్ఛమైన చెరకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.
చర్మానికే కాకుండా జుట్టు రక్షణకు కూడా చెరకు రసం ఉపయోగపడుతుంది. చెరకు రసాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే పొడిబారిన జుట్టు తిరిగి పట్టులా మెరుస్తుంది.
Team India | అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్ -19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం
Joginder Gyong | ఫిలీప్పీన్స్ నుంచి భారత్‌కు గ్యాంగ్‌స్టర్ జోగిందర్ గ్యోంగ్
PM Modi | ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం.. మార్చి 8న మహిళల ఖాతాల్లో.. : ప్రధాని మోదీ
Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్
Student gave birth | కాలేజీ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం.. ఆ తర్వాత..!
Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్
Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?