Sini Shetty Favorite Food | మిస్ ఇండియా కిరీటం దక్కించుకుని ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా నిలిచింది సినీ శెట్టి. అందాల పోటీలో అదరగొట్టిన ఈ భామ త్వరలోనే వెండితెర మీదా మెరవనుంది. సన్నజాజి తీగలా ఉండే సినీ శెట్టి తిండి విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటుందట. బయటి తిండి కంటే అమ్మచేతి వంటనే ఇష్టపడుతుందట.
అందులోనూ నీరు దోశ, రోటీ, బిర్యానీ, కడాయి చికెన్ మరీ ఇష్టంగా తింటుందట. అన్నిటికంటే అమ్మచేతి పెరుగన్నం అంటే చెప్పలేనంత ఇష్టం అంటున్నది. ఏదేమైనా రోజూ అమ్మచేతి వంట మిస్సవనని అంటున్నది ఈ మిస్ ఇండియా. బెంగళూరు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా, ఇంటి నుంచి క్యారేజీ వెళ్లాల్సిందే.కాస్త మార్పు కావాలనుకున్నప్పుడు మాత్రం చలో రెస్టరెంట్.