Vijay Devarakonda | రష్మికతో రిలేషన్‌పై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | వెండితెరపై చూడముచ్చటైన జోడీగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరు కలిసి ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న విజయ్ దేవరకొండ..రష్మిక మందన్నతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
రష్మిక మందన్నతో మీరు డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు విజయ్ బదులిస్తూ ‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కెరీర్ ఆరంభంలో ఇద్దరం కలిసి రెండు చిత్రాల్లో నటించాం. రష్మిక అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. కేవలం సినిమాలే కాకుండా వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాల గురించి మట్లాడుకుంటాం. క్రమంగా మా బంధం బలపడుతూ వచ్చింది’ అని చెప్పారు.
తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బాహాటంగా స్పందించనని, ఒకవేళ తాను ప్రేమలో ఉన్నాననే విషయం చెబితే అభిమానులు చాలా మంది హర్ట్ అవుతారని విజయ్ దేవరకొండ తెలిపారు. ‘నటుడిగా నన్ను ఎంతో మంది ప్రేమిస్తారు. వారి గదుల్లో నా పోస్టర్స్ పెట్టుకుంటారు. వారి హృదయాల్ని ముక్కలు చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే రిలేషన్ఫిప్ స్టేటస్‌ను రహస్యంగా ఉంచుతా’ అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

