Rahul Gandhi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Arificial Intelligence) సాంకేతికత (Technology) ని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని, వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని, చేతలు కావాలని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. డ్రోన్లు, ఏఐ లాంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మనకు బలమైన పునాది కావాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్ (X)’ లో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు.
Drones have revolutionised warfare, combining batteries, motors and optics to manoeuver and communicate on the battlefield in unprecedented ways. But drones are not just one technology – they are bottom-up innovations produced by a strong industrial system.
Unfortunately, PM… pic.twitter.com/giEFLSJxxv
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2025
డ్రోన్లు యుద్ధరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయని, బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్స్ జత చేయడంలో యుద్ధభూమితో కమ్యూనికేట్ అవుతున్నాయని అన్నారు. డ్రోన్లు కేవలం సాంకేతికత మాత్రమే కాదని, బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలని చెప్పారు. దీన్ని గ్రహించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని తెలిపారు. ఏఐపై ప్రధాని ప్రసంగాలకే పరిమితమవుతుంటే.. మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయని అన్నారు. కొత్త సాంకేతికను అందిపుచ్చుకునేందుకు మనకు బలమైన పునాది కావాలని, వట్టి మాటలతో కాదని చెప్పారు.
దేశంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మనం విఫలమవుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఆ దిశగా ఒక స్పష్టమైన వ్యూహం అవసరమని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, దేశాన్ని ముందుకు నడిపేందుకు దృఢమైన పారిశ్రామిక నైపుణ్యం కావాలని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని విమర్శించారు.
ఉత్పత్తి రంగంలో మన వైఫల్యం వల్లనే చైనా ఇక్కడ మకాం వేసిందని, ఇప్పటికైనా తయారీ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉందని రాహుల్ గాంధీ సూచించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ఐడియా మంచిదే అయినా దాని ఫలితం కళ్లముందే ఉందని చెప్పారు. 2014లో జీడీపీలో 15.3 శాతంగా ఉన్న మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇవాళ 12.6 శాతానికి తగ్గిపోయిందని, గత 60 ఏళ్లలో ఇది అత్యంత కనిష్టమని అన్నారు. ప్రధానమంత్రిని తాను తప్పుపట్టడం లేదని, ఆయన ప్రయత్నించడం లేదని కూడా అనబోనని, ఆయన ప్రయత్నించినా విఫలమయ్యారని మాత్రం చెప్పగలనని వ్యాఖ్యానించారు.
మొబిలిటీలో మార్పులకు నాలుగు టెక్నాలజీలు ప్రధానమని, ఎలక్ట్రిక్ మోటార్స్, బ్యాటరీస్, ఆప్టిక్స్, వాటన్నింటికంటే టాప్‌లో ఏఐ ఉంటుందని రాహుల్‌గాంధీ అన్నారు. ఏఐ గురించి మాట్లాడేటప్పుడు అది సొంత ఏఐ కాకపోతే దానికి అర్ధం లేదని, ఎందుకంటే అది డాటాపై ఆపరేట్ అవుతుందని చెప్పారు. ఇవాళ మనం డాటాను చూస్తే ప్రొడక్షన్ సిస్టమ్ నుంచి వచ్చే ప్రతి సింగిల్ డాటా చైనాదేనని రాహుల్ అన్నారు.
Alcohol Consumers | మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
High Court | భార్య వేరొకరిని ప్రేమించడం నేరం కాదు.. అది లేనపుడు వివాహేతర సంబంధం కాదు: హైకోర్టు
Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Elon Musk | నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన పోస్ట్