Elon Musk | టెక్ దిగ్గజం, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక విశేషం, వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ కుబేరుడి వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక వార్త హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటుంది. అలాంటిదే తాజాగా మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
మస్క్ గురించి 31 ఏళ్ల రచయిత్రి యాష్లే సెయింట్ క్లెయిర్ (Ashley St. Clair) ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఐదు నెలల క్రితం మస్క్ బిడ్డకు తాను జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటన చేసింది. ‘ఐదు నెలల క్రితం నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. ఆ బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకూ నేను ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే నేనే వెల్లడించాలనుకున్నా. మా బిడ్డ సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే 12 మంది పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. మొదటి భార్య జస్టిన్ మస్క్‌కు పుట్టిన తొలి బేబీ.. జన్మించిన 10 వారాల్లోనే మృతిచెందింది. 2008లో ఇదే జంట ఐవీఎఫ్ ద్వారా అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. గ్రిఫిన్, వివియన్ కవలలు పుట్టారు. ఆ తర్వాత సాక్సన్, డామియన్, కాయి పుట్టారు. అయితే, కొద్ది రోజులకే ఈ జంట విడిపోయింది. ఇక జస్టిన్‌తో విడాకుల అనంతరం బ్రిటీష్ నటి తలూలాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. అయితే వీరికి సంతానం లేదు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో మ్యూజిక్ స్టార్ గ్రైమ్స్‌తో మస్క్ ముగ్గురు పిల్లలు కన్నారు.
ఇక 2021లో శివోన్ జిల్లిస్ అనే మహిళతో రహస్యంగా రిలేషన్ కొనసాగించారు మస్క్. మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో శివోన్ జిల్లిస్ పనిచేస్తున్నది. ఆమెకు మొదట ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత మూడో చిన్నారికి కూడా జన్మనిచ్చినట్లు మస్క్ ప్రకటించారు.
Also Read..
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Kangana Ranaut | ఇది నా చిన్న నాటి కల.. హిమాలయాల్లో కేఫ్ ఓపెన్ చేసిన కంగనా రనౌత్
Sheeshmahal | ఢిల్లీ ‘శీష్ మహల్’పై విచారణకు ఆదేశించిన కేంద్రం