AAP Councillors : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఢిల్లీలో ఆధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి పుండుమీద కారంలా మరో షాక్ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికల ముందు ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు (Councillors) బీజేపీ (BJP) లో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ (Virendra Suchdeva) సమక్షంలో వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఏప్రిల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) లో మేయర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం సచ్దేవ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో త్వరలో కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఏర్పడనుందని, మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యసాధనలో భాగంగా ఢిల్లీ అభివృద్ధికి ఇదే సరైన తరుణమని అన్నారు. ఢిల్లీని క్లీన్ అండ్ బ్యూటిఫుల్ సిటీగా మార్చేందుకు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారని చెప్పారు.
#WATCH | MCD Councillors Anita Basoya, Sandeep Basoya, Nikhil Chaprana, Dharmavir and others join BJP in the presence of Delhi’s BJP President Virendraa Sachdeva, in Delhi. pic.twitter.com/7ZfAXtcXqM
— ANI (@ANI) February 15, 2025
షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో మేయర్ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. 2024 నవంబర్‌లో మేయర్ ఎన్నికలు జరుగగా మూడు ఓట్ల ఆధిక్యంతో ఆప్ గెలిచింది. ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కౌన్సిలర్లతోపాటు ఏడుగురు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ హక్కు ఉంటుంది. తాజాగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో ఆప్ సంఖ్యాబలాన్ని బీజేపీ అధిగమించినట్లయ్యింది.
2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు, బీజేపీకి 104 వార్డులు, కాంగ్రెస్‌కు 9 వార్డులు, ఇండిపెండెంట్లకు 3 వార్డులు దక్కాయి. అయితే మేయర్ ఎన్నికల్లో లోక్‌సభ సభ్యులు, నామినేటెడ్ ఎమ్మెల్యేల్లో కొందరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు (3), కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారు. దాంతో బీజేపీ బలం 134 అయ్యింది. కానీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఆప్‌కు ఓటేయడంతో మూడు ఓట్ల తేడాతో ఆప్ ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకుంది.
కాగా ఈనెల 13న ఎంసీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17 వేల కోట్లతో బడ్జెట్‌ను కార్పోరేషన్ ఆమోదించింది. అందులో పారిశుధ్యానికి అత్యధికంగా రూ.4,907.11 కోట్లు కేటాయించారు.
Alcohol Consumers | మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
High Court | భార్య వేరొకరిని ప్రేమించడం నేరం కాదు.. అది లేనపుడు వివాహేతర సంబంధం కాదు: హైకోర్టు
Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Elon Musk | నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన పోస్ట్