Alcohol Consumers : మద్యం సేవించడం (Alcohol consumption) అనేది ఒకప్పుడు పురుషుల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మద్యం తాగే ఆడవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అస్సాం (Assam) లో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో మద్యపానం వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే (Survey) లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో మద్యం వినియోగం ఏ స్థాయిలో ఉంది..? ఏయే రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం వినియోగిస్తున్నారు..? మద్యం తాగే మహిళలు ఏ స్థాయిలో ఉన్నారు..? అత్యధికంగా ఏ రాష్ట్రంలో మహిళలు మద్యం తాగుతున్నారు..? అనే కోణాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సర్వేను నిర్వహించింది. మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.
ఇక మద్యం సేవించే మహిళల విషయానికి వస్తే.. అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య అత్యధికంగా ఉందని తేలింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉండగా.. అస్సాంలో ఈ సగటు 16.5 శాతానికి దగ్గరగా ఉంది. అస్సాం తర్వాత స్థానంలో మేఘాలయలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. అక్కడ 8.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. ఇక ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
High Court | భార్య వేరొకరిని ప్రేమించడం నేరం కాదు.. అది లేనపుడు వివాహేతర సంబంధం కాదు: హైకోర్టు
Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Elon Musk | నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన పోస్ట్