రామవరం, సెప్టెంబర్ 06 : ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ముందస్తు వైద్య పరీక్షలు కీలకమని డాక్టర్ డి.లలిత అన్నారు. శనివారం సింగరేణి మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా పరిధిలోని తిప్పనపల్లి గ్రామ, పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
మెడికల్ క్యాంప్‌నకు హాజరైన 160 మందికి మధుమేహం, బీపీ, గుండె సంబంధ, ఊబకాయం, కాలానుగుణ వ్యాధులకు సంభంధించిన ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలో, పాటించాల్సిన పద్దతులు, సూచనలు, సలహాలు తెలియజేసి మందులను అందించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్ ఖని కోల్ మైన్ సంక్షేమ అధికారి ఎండీ.ఖలీల్ అహ్మద్, స్టాఫ్ నర్స్ రెహానా, ఫిట్ సెక్రటరీ ఏఐటీయూసీ యూనియన్ ఎం.ఆర్.కే.ప్రసాద్, ఫిట్ సెక్రటరీ ఐఎన్టీయూసీ యూనియన్ గోపు కుమార్, తిప్పనపల్లి గ్రామ సెక్రెటరీ శివ, గ్రామస్తులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.