Ramavaram : జీవనశైలి మార్పులతో సంపూర్ణ ఆరోగ్యం : డాక్టర్ లలిత
ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ముందస్తు వైద్య పరీక్షలు కీలకమని డాక్టర్ డి.లలిత అన్నారు.
రామవరం, సెప్టెంబర్ 06 : ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ముందస్తు వైద్య పరీక్షలు కీలకమని డాక్టర్ డి.లలిత అన్నారు. శనివారం సింగరేణి మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా పరిధిలోని తిప్పనపల్లి గ్రామ, పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
మెడికల్ క్యాంప్‌నకు హాజరైన 160 మందికి మధుమేహం, బీపీ, గుండె సంబంధ, ఊబకాయం, కాలానుగుణ వ్యాధులకు సంభంధించిన ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలో, పాటించాల్సిన పద్దతులు, సూచనలు, సలహాలు తెలియజేసి మందులను అందించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్ ఖని కోల్ మైన్ సంక్షేమ అధికారి ఎండీ.ఖలీల్ అహ్మద్, స్టాఫ్ నర్స్ రెహానా, ఫిట్ సెక్రటరీ ఏఐటీయూసీ యూనియన్ ఎం.ఆర్.కే.ప్రసాద్, ఫిట్ సెక్రటరీ ఐఎన్టీయూసీ యూనియన్ గోపు కుమార్, తిప్పనపల్లి గ్రామ సెక్రెటరీ శివ, గ్రామస్తులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

