Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే అన్నప్రసాద వితరణ
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ మేరకు ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
చంద్ర గ్రహణం సందర్భంగా అన్నప్రసాద వితరణలో చేసిన మార్పును భక్తులు గమనించాల్సిందిగా ఈవో సూచించారు. అలాగే చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
చంద్రగ్రహణం ఈ నెల 7వ తేదీ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని పేర్కొన్నారు. అలాగే సాక్షి గణపతి, హాఠకేశ్వరం, పాలధార, పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

