హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇటలీలో జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగిన సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ ప్రపంచ చాంపియన్షిప్ (ప్రమోషనల్ క్లాస్)లో బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు.
కామారెడ్డి గురుకులానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని రిష్విత రజత పతకం సాధించినట్టు సెక్రటరీ సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థిని రిష్విత, ప్రిన్సిపాల్ మాధవికి శుభాకాంక్షలు తెలియజేశారు.