బోనకల్లు, సెప్టెంబర్ 06 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గతేడాది మండలంలో రావినూతల ఉన్నత పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్యకు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు లభించింది. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని శనివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాలరెడ్డి, ఖమ్మం డీఈఓ శ్రీజ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు తదితరులు పుల్లయ్యకు అభినందనలు తెలిపారు.