తాండూర్ : వాసవి క్లబ్ ( Vasavi Club ) ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వారోత్సవాల సందర్భంగా తాండూర్ లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జర్నలిస్టులను ( Journalists ) సన్మానించారు. వాసవి క్లబ్ తాండూర్ వనిత సిందూర్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శాలువా కప్పి , మొక్కలు ఇచ్చి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 107 ఏ కార్పొరేట్ వైస్ చైర్మన్ కే సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బోనగిరి చంద్రశేఖర్, వాసవి క్లబ్ తాండూర్ అధ్యక్షులు మైలారపు మధుసూదన్, కార్యదర్శి మనికృష్ణ, కోశాధికారి రాచకొండ మహేష్, వాసవి వనిత సింధూర్ క్లబ్ అధ్యక్షురాలు కేశెట్టి సువర్ణ, కార్యదర్శి కోడిప్యాక మాధురి, కోశాధికారి రాచకొండ కల్పన, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, వూటూరి నరేష్, మాచుకరి సంతోష్, కొంకుముట్టి స్వప్న, పుల్లూరి సంతోష్, గందె శ్రీదేవి, గందె శిరీష, కొంకుముట్టి సాహితీ, కాసం సునీత, తదితరులు పాల్గొన్నారు.