SIT | మోయినాబాద్ డ్రగ్స్ కేసు.. 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు..!
SIT : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)ను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది.
SIT : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)ను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించడం, డ్రగ్స్ పార్టీపై లోతుగా విచారణను జరపడం కోసం తొమ్మది మంది అధికారులకు బాధ్యతలు అప్పగించింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేయనుంది.
సిట్ చీఫ్‌గా చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జున, ఎస్ఐలు కోటేశ్వర్ రావు, వెంకన్న, సదత్ అలీలు ఎంపికయ్యారు.
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుఉన్నాయని సిట్ ఆరోపించింది. వెంటనే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు సిట్ లేఖ రాసింది. ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజులకు కస్టడీ కోరింది.అలానే రితేశ్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు సిట్ లేఖ రాసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

