Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్(Asia Cup) ప్రారంభానికి మరో మూడు రోజులే ఉంది. టైటిలో కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నా అభిమానుల దృష్టంతా భారత్(India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌పైనే ఉంది. సెప్టెంబర్ 14 చిరకాల ప్రత్యర్థుల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. అయితే.. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌తో క్రికెట్ ఏంటీ? అని విమర్శలు వస్తున్న వేళ.. టీమిండియా బాయ్‌కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. దాయాదుల పోరు జరుగుతుందా? లేదా? అనే కథనాలకు ఎట్టకేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి చెక్ పెట్టింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేనందున కచ్చితంగా పాక్‌తో టీమిండియా తలపడుతుందని కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించాడు. ‘ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బీసీసీఐ పాటించనుంది. ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లో భారత జట్టు ఆడడంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌కు మిత్రదేశం కాని జట్టుతో కూడా ఆడడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి.. పలు దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు ఆడుతుంది.
#Watch: BCCI Secretary Devajit Saikia clarified that India will play Pakistan in the #AsiaCup2025 as there are no central government restrictions on multinational tournaments. He stressed that while bilateral series with hostile nations are off the table, India cannot boycott… pic.twitter.com/hmxtG3XscP
— India Today NE (@IndiaTodayNE) September 6, 2025
ఆసియా కప్ అనేది మల్టీ నేషనల్ టోర్నమెంట్. ఇందులో ఆసియాలోని దేశాలు పోటీపడుతాయి. భారత్‌తో శత్రుత్వం ఉన్న దేశపు టీమ్ కూడా వీటిలో ఉండచ్చు. అయినా సరే.. మా జట్టు బరిలోకి దిగుతుంది. అయితే.. ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)ల విషయానికొస్తే మాత్రం శత్రు దేశాలతో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు’ అని ఏఎన్ఐ వార్త సంస్థతో సైకియా వెల్లడించాడు.
పహల్గాం ఉగ్రదాడి.. ‘ఆపరేషన్ సిందూర్’ తదనంతరం పరిణామాలతో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొంది. లెజెండ్స్ లీగ్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఇరుదేశాల మ్యాచ్‌లను ఇండియా ఛాంపియన్స్ బాయ్‌కాట్ చేసింది. దాంతో.. ఆసియా కప్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పాక్‌తో సెప్టెంబర్ 14న ఆడాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. డబ్బుల కోసం బీసీసీఐ పాక్‌తో మ్యాచ్‌కు అంగీకరించిందనే విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌లో మినహా అంతర్జాతీయ వేదికలపై శత్రు దేశాలతో భారత జట్టు క్రికెట్ ఆడేందుకు అనుమతిచ్చింది.