ఇచ్చోడ : రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా ( Urea ) అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో ( BRS protest ) నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రైతులకు యూరియా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
రైతులకు సరిపడ యూరియా అందక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్న పట్టాకు రెండే యూరియా బస్థాలు ఇస్తున్నారని, యూరియాతో పాటు బలవంతంగా నానో యూరియా బాటిల్ ఇస్తున్నారని ఆరోపించారు. నానో యూరియా బాటిల్ తీసుకుంటేనే యూరియా ఇస్తామని అధికారులు రైతులను సతాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతులకు సరిపడ యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా కేసీఆర్ ( KCR ) , కేటీఆర్ ( KTR ) , ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నాయకత్వంలో ఇచ్చోడా మండల కేంద్రం రాస్తారొకో చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ రెడ్డి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, సర్పంచ్ పాండురంగ్, నర్వాడే రమేష్, మహుమూద్, గణేష్, ప్రవీణ్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు .