నార్నూర్ : పక్షం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజ్ పొంగే బబన్ ( Raj Ponge Baban ) అంతక్రియలు ( Funeral ) ఆదివారం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ మృతుడి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం తన వంతుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావు,
దళిత అవార్డు గ్రహీత అన్నా బావు సాటే కమిటీ మండల అధ్యక్షుడు కోరల మహేందర్, మాజీ ఉపసర్పంచ్ చౌహన్ మహేందర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి, నాయకులు షేక్ దాది అలీ, సయ్యద్ ఖాసిం, ధర్మ రక్షిత్, గుంజ చిన్నయ్య, శివాజీ, మోహన్, గణేష్, శ్రీరంగ్, దిగంబర్, శీను, దయానంద్, రాజు, సునీల్, అనిల్ తదితరులు ఉన్నారు.