IND vs PAK : భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైట్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 8 :00 గంటలకు దాయాది జట్లు లీగ్ దశ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎప్పటిలానే ఈసారి కూడా చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే… మూడేళ్ల క్రింత టీ20 వరల్డ్ కప్‌లో.. రెండేళ్ల కింద స్వదేశంలో పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా అదే జోరు చూపాలనే కసితో ఉంది. అందుకు తమ వద్ద రెండు వ్యూహాలు ఉన్నాయంటున్నాడు అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్చేట్ (Ryan Doeschate). ఇంతకూ అవేంటో తెలుసా..?
‘ఆసియా కప్ వంటి మెగా టోర్నీల్లో మ్యాచ్ రోజు వ్యూహాల్ని ఎలా అమలు చేస్తాం? అనేది చాలా కీలకం. ఈ మధ్యకాలంలో భారత జట్టు ఫామ్ బట్టి నేను నిజాయతీగా చెబుతున్నా.. ఈసారి టీమిండియానే ఫేవరెట్. పాక్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా మా వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం. బ్యాటింగ్ అనుకోండి 120 బంతులు ఆడడం మీదే ఆటగాళ్ల దృష్టి పెడుతారు. అదే బౌలింగ్ చేయాల్సి వస్తే.. 20 ఓవర్లు మెరుగ్గా, నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే.. టీమిండియా క్రికెటర్లు అంచనాలకు తగ్గట్టు రాణించేందుకు సిద్ధమవుతున్నారు’ అని అసిస్టెంట్ కోచ్ పేర్కొన్నాడు.
అంతేకాదు పాక్ మ్యాచ్ కోసం భారత్ కొత్తగా ఏమీ చేయడం లేదని డస్చేట్ అంటున్నాడు.
🇮🇳 have won the last 5 meetings pic.twitter.com/J9zqrRxKmU
— ESPNcricinfo (@ESPNcricinfo) September 14, 2025
అలానే ప్రత్యేక సన్నద్ధత కూడా చేయడం లేదని కోచ్ గౌతం గంభీర్ జట్టు సభ్యులకు గేమ్ ప్లానింగ్ వివరించడానికి చెప్పాడీ సహాయక కోచ్. ‘ఆసియా కప్‌లో మాకు ప్రతి మ్యాచ్ కీలకమే. పాక్‌తో మ్యాచ్ కూడా అలాంటిదే. అందుకే ఈ వారంలో భారత ఆటగాళ్లు కొ్త్త ప్రయోగాలు ఏమీ చేయలేదు. పాక్‌తో ఆడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా సరే.. బీసీసీఐ, ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నాం’ అని డస్చేట్ వివరించాడు.
ఆసియా కప్‌లో ఇప్పటివరకూ భారత్, పాక్ జట్లు 19 సార్లు తలపడ్డాయి. ప్రత్యర్థిని వణికిస్తూ టీమిండియా 10 విజయాలు సాధించింది. ఆరింటా ఓడగా.. మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. పదిహేడో సీజన్లో ఆదివారం రాత్రి దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాక్ తలపడనున్నాయి. రాత్రి 730 గంటలకు టాస్ పడనుంది. 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Ryan ten Doeschate says that while Team India understands the public sentiment, their focus remains firmly on the game.#AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/fhs7pv1rc8
— Circle of Cricket (@circleofcricket) September 13, 2025