BRS Protest | రైతులకు యూరియా అందజేయాలని బీఆర్ఎస్ రాస్తారోకో
BRS Protest | రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో నిర్వహించారు.
ఇచ్చోడ : రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా ( Urea ) అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో ( BRS protest ) నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రైతులకు యూరియా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
రైతులకు సరిపడ యూరియా అందక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్న పట్టాకు రెండే యూరియా బస్థాలు ఇస్తున్నారని, యూరియాతో పాటు బలవంతంగా నానో యూరియా బాటిల్ ఇస్తున్నారని ఆరోపించారు. నానో యూరియా బాటిల్ తీసుకుంటేనే యూరియా ఇస్తామని అధికారులు రైతులను సతాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతులకు సరిపడ యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా కేసీఆర్ ( KCR ) , కేటీఆర్ ( KTR ) , ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నాయకత్వంలో ఇచ్చోడా మండల కేంద్రం రాస్తారొకో చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ రెడ్డి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, సర్పంచ్ పాండురంగ్, నర్వాడే రమేష్, మహుమూద్, గణేష్, ప్రవీణ్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు .
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

