నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 13 : కోర్టు కేసుల పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యాం కోశి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో జరిగిన జాతీ య లోక్‌అదాలత్ సేవలు, కమ్యూనిటీ మీడియేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాకు విచ్చేసిన న్యాయమూర్తులను అటవీశాఖ వసతి గృహంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు పంచాక్షరి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 13 : పరిమిత వనరులతో కోర్టుల ద్వారా కేసుల సత్వర పరిషారానికి వీలు పడదని, ఇరుపక్షాలు రాజీపడి లోక్‌అదాలత్ వేదికగా దావాల నుంచి విము క్తి పొందాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్ కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు.
జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్ర భాకర్‌రావు ప్రారంభించారు. పిటి, ట్రాఫిక్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకులు, భీమా కంపెనీలు, మోటార్ వెహికిల్ యాక్ట్, ఎఫ్ఎఆర్ అయిన పీఎల్సీ వంటి కేసులను పరిషరిస్తూ తీర్పు ప్రతులను ఇరుక్షాలకు అందజేశారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్ పాల్గొన్నారు.