 
                                                            హనుమకొండ : వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపు మేరకు శ్రేణులు రెండు రోజుల నుంచి సహాయక చర్యల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వంటలు వండి, భోజనం ప్యాకెట్లను సిద్ధం చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా బాధిత కుంటుంబాలకు పంపిణీ చేశా రు. సమ్మయ్యనగర్‌లో మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, కాపువాడలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో ఆహారం పంచారు.
కాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంజిత్ రెడ్డి, నరేందర్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. నగరంలో సుమారు ఐదు వేల మందికి అల్పాహారంతో పాటు ఆహారం అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేట్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్దె వెంకన్న, మాడిశెట్టి అరుణ్‌కుమార్, అనిల్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పర్యటించారు. కాపువాడ, అదాలత్, జూలైవాడ, అమరావతి నగర్, సమ్మయ్యనగర్, ప్రగతినగర్, గుండ్లసింగారం పునరావాస కేంద్రం, రామన్నపేట, హంటర్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో నీట మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆహార పదార్థాలు, మంచినీటిని అందజేశారు.
 
                            