హనుమకొండ, అక్టోబర్ 30: హనుమకొండ నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో నగర రోడలన్నీ కొట్టుకుపోయాయి. గుంతలుపడి, కంకరతేలి అధ్వానంగా తయ్యాయి. దీంతో అటువైపు వాహనదా రులకు ఇబ్బందులు తప్పలేదు. గుంతలుపడి ప్రమాదకరంగా మారిన రోడ్ల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కరలు, సంచులు ఏర్పాటు చేశారు.
హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయ ప్రధాన రహదారి, హనుమకొండ చౌరస్తా, బస్‌స్టేషన్ రోడ్డు, పెద్దమ్మగడ్డ వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. సైడ్ బర్మ్‌లు కొట్టుపోయి ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.