న్యూశాయంపేట, అక్టోబర్ 30 : మొంథా తుపాన్ ప్రభావంతో బుధవారం కురిసిన భారీ వర్షానికి హనుమకొండ హంటర్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశంతో గురువారం బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గోలి శ్రీలత తెలిపారు.
తమ కళాశాలలో చదువుతున్న 470మంది విద్యార్థినులను భూపాలపల్లి డిగ్రీ కళాశాల, మడికొండ, హసన్పర్తి గురుకుల కళాశాలలకు రెవెన్యూ, పోలీస్, మునిసిపల్ అధికారుల పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సహకారంతో తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్, సుబేదారి సీఐ రంజిత్ రావు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు పాల్గొన్నారు.