Skyroot Aerospace | దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్.. హైదరాబాదీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అరుదైన ఘనత
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్.. స్కైరూట్ ఏరోస్పేస్ ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నది. దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతున్నది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్, కమర్షియల్ రాకెట్ గగనతలంలోకి దూసుకుపోవచ్చని చెప్తున్నారు.
- వాణిజ్య ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం
- భారత్‌లో ఇస్రో కాకుండా ఇతర సంస్థలకిదే మొదటిసారి
దేశంలో అంతరిక్ష్య ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఇస్రో. అయితే భారతీయ అంతరిక్ష్య పరిశోధన సంస్థ (ఇస్రో)కున్న ఈ ఘనత ఇక ఎంతోకాలం కొనసాగకపోవచ్చు. అవును మరి. ఇస్రోను తక్కువ చేయడం కాదుగానీ.. హైదరాబాదీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఓ వాణిజ్య రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. భారత్‌లో ఈ తరహా తొలి ప్రైవేట్ రాకెట్ ఇదే కావడం విశేషం.
Skyroot Aerospace | హైదరాబాద్, అక్టోబర్ 30 : హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్.. స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నది. దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతున్నది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్, కమర్షియల్ రాకెట్ గగనతలంలోకి దూసుకుపోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా భారతీయ అంతరిక్ష్య పరిశోధన సంస్థ (ఇస్రో) మాత్రమే ఈ తరహా ప్రయోగాలను చేస్తున్నది. అయితే ఇక స్కైరూట్ ఏరోస్పేస్ సైతం అందుకు వేదిక కాబోతుండటం గమనార్హం.
జనవరిలో..
ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తల కంపెనీయే ఈ స్కైరూట్ ఏరోస్పేస్. వచ్చే ఏడాది జనవరిలో అంతరిక్ష్యంలోకి తమ తొలి పూర్తిస్థాయి శాటిలైట్ మిషన్‌ను పంపాలని స్కైరూట్ ప్రయత్నిస్తున్నది. దీంతో భారతీయ అంతరిక్ష్య పరిశోధనా రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పునాదులు పడ్డట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, టీమ్సెక్, జీఐసీ వంటి ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నారు. అయితే వచ్చే ఏడాది ప్రతీ 3 నెలలకోసారి ఒక ప్రయోగాన్ని చేపట్టాలని స్కైరూట్ యోచిస్తున్నది. ఈ క్రమంలోనే 2027కల్లా నెలకోసారి జరుపాలనుకుంటున్నామని చెప్తున్నది.
9 నెలలు.. 3 మిలియన్ డాలర్లు
ఒక్కో రాకెట్ నిర్మాణానికి దాదాపు 8-9 నెలల సమయం పడుతుందని, 2-3 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని స్కైరూట్ సీఈవో పవన్ చందన చెప్తున్నారు. దేశ, విదేశీ కస్టమర్ల పేలోడ్స్‌తో ఒక్కో ప్రయోగం ద్వారా సుమారు 5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోవచ్చనీ అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చిన్నపాటి శాటిలైట్ల ప్రయోగాలకు డిమాండ్ పెరుగుతున్నదంటున్న స్కైరూట్.. తమ ప్రయోగాలతో ము న్ముందు భారత, అంతర్జాతీయ క్లయింట్లకు మరింత చౌకగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నది.
- 2018లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించారు. ఫండింగ్‌లో భాగంగా రూ.850 కోట్ల నిధులను ఈ కంపెనీ సమీకరించింది.
- 2022 నవంబర్‌లో తమ సబ్‌ఆర్బిటల్ వెహికిల్ విక్రమ్-ఎస్‌ను పరీక్షించడం ద్వారా ఓ రాకెట్‌ను లాంచ్ చేసిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా స్కైరూట్ గుర్తింపు పొందింది.
- ప్రస్తుతం ఇంజినీరింగ్, సరఫరాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ.. 2028 మార్చి నాటికి లాభాల్లోకి అడుగుపెడుతామన్న ధీమాను కనబరుస్తున్నది.
- భారతీయ ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీలో 200కుపైగా స్టార్టప్‌లు. 2033కల్లా ఈ రంగం విలువ 44 బిలియన్ డాలర్లకు చేరగలదని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంచనా వేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

