RS Praveen Kumar | హైదరాబాద్ : కొండా సురేఖ దంపతుల అఘాయిత్యాలకు వరంగల్‌లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, మీ ఫాం హౌస్‌ల గోడలే సాక్ష్యమని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
మీ గురించి తెలంగాణతో పాటు వరంగల్ ప్రజలకు తెలుసు. మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు, యూనివర్సిటీ హాస్టళ్లలో మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల ఎంతో మంది బలయ్యారు. వరంగల్‌లో ఉండే గెస్ట్ హౌస్‌లు, మీ ఫామ్ హౌస్‌లు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. 2002లో ఇప్పుడున్న జమ్మూకశ్మీర్ డీజీపీ నళిని ప్రభాకర్ మీ కుటుంబానికి హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. దానికి సాక్షి మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే.. ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
నాతో పాటు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నదా.. సురేఖ గారూ..? రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు.. ఆకలితో అలమటిస్తూ.. ప్రతి రోజు విషాహారం తిని తల్లడిల్లుతున్నా.. వైద్యం దొరకని ధీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లల బాధలు మీకు అర్థమైత లేవా..? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీఆర్ఎస్వీ గురుకుల బాట 85220 44336 నంబర్‌కు వాట్సాప్ చేయొచ్చు. ఫొటోగ్రాఫ్స్, వీడియోస్ ఉంటే పంపించండి.. ఆ సమస్యలపై మేం పోరాటం చేస్తాం. అసలు సమస్యను పక్కన పెట్టి.. ప్రతిపక్షం మీద బురద జల్లడం సరికాదు. మేం కుట్రలు చేస్తున్నామనడం సరికాదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tiger | ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి దాడి.. రైతుకు తీవ్రగాయాలు