Lavanya tripathi | విరోష్ జంట పెళ్లిపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమా నేను చేసి ఉంటే వాళ్లు కలిసేవారు కాదేమో..
Lavanya tripathi | టాలీవుడ్ పాపులర్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ‘గీత గోవిందం’ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Lavanya tripathi | టాలీవుడ్ పాపులర్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ‘గీత గోవిందం’ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమాకు మొదట నన్నే హీరోయిన్గా అడిగారు. అప్పట్లో కథ వినకముందే నేను ఆ ప్రాజెక్ట్కు నో చెప్పాను. తర్వాత కథ విన్నాక మాత్రం సినిమా చేయడానికి ఓకే చెప్పాను. కానీ అప్పటికే కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల ఆ సినిమా నా చేతుల నుంచి వెళ్లిపోయింది అని చెప్పింది. అదే సందర్భంలో ఆమె మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేసింది. ఆ సినిమా వల్లే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు.
వాళ్లిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా కూడా అదే. వాళ్లు కలవాలని ఆ సినిమా నా దగ్గర నుంచి వెళ్లిపోయిందేమో అనిపిస్తుంది. వాళ్లిద్దరూ నిజంగా చాలా అందమైన జంట అని లావణ్య త్రిపాఠి తెలిపింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి చేసిన మొదటి సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఈ జంటకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. తర్వాత ఈ జంట మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే గ్రాండ్గా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇప్పుడీ విషయంపై లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “లావణ్య త్రిపాఠి ఆ సినిమా చేసి ఉంటే విజయ్–రష్మిక కలిసేవారు కాదేమో” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఒక సినిమా కథ ఎలా ఇద్దరి జీవితాలను మార్చిందో అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

