By-election Schedule | ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
By-election Schedule | కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోపాటే మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను విడుదల చేసింది.
By-election Schedule : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోపాటే మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను విడుదల చేసింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు మార్చి 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 24 స్క్రూటినీ నిర్వహిస్తారు. మార్చి 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది.
ఇక మహారాష్ట్ర, గుజరాత్లో ఉపఎన్నికలకు మార్చి 30న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే ఉప ఎన్నికల ఫలితాలు కూడా మే 4న వెల్లడికానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

